హైబీపీ ఎక్కువ కాలం ఉంటే.. కలిగే నష్టాలు ఇవే..
హైబీపీ వల్ల రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఫలితంగా గుండె కండరాలు బలహీనపడతాయి.
అధిక రక్తపోటు ఎక్కువ కాలం కొనసాగితే రక్తనాళాలు గట్టిపడతాయి. అలాగే ఇరుకుగా మారతాయి. ఫలితంగా రక్త ప్రసరణ ప్రభావితమవుతుంది.
హైబీపీ వల్ల మెదడుకు రక్తాన్ని చేర వేసే నాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా పక్షవాతం రావచ్చు.
హైబీపీ కళ్లలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా దృష్టి లోపం, అంధత్వం వంటి సమస్యలు మొదలవుతాయి.
అధిక రక్తపోటు వల్ల రక్తంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేసే మూత్రపిండాల సామర్థ్యం దెబ్బతింటుంది. కిడ్నీ సమస్యలు పెరుగుతాయి.
దీర్ఘకాలిక అధిక రక్తపోటు వల్ల జ్ఞాపక శక్తిని కోల్పోవడం, బ్రెయిన్ సమస్యలు మొదలవుతాయి.
హైబీపీ ధమనులలో అడ్డంకులు ఏర్పడడానికి కారణమవుతుంది. ఫలితంగా కరోనరీ ఆర్టరీ వ్యాధులు లేదా గుండె పోటు వంటి సమస్యలు వస్తాయి.
ఎంతో ప్రమాదకర బీపీని అదుపులో ఉంచుకోవడానికి సక్రమంగా మందులు వేసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి తగ్గించుకోడంపై దృష్టి సారించాలి.
Related Web Stories
దాభా స్టైల్లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
సూర్య నమస్కారాలు చేస్తే ఇన్ని లాభాలున్నాయా..
మొటిమలు గిల్లుతున్నారా..అయితే జరిగేది ఇదే..!
పగిలిన మడమలతో ఇబ్బంది పడుతున్నారా..! నొప్పి లేకుండా ఇలా తగ్గించుకోండి