జాగ్రత్త..  ఈ శబ్దాలు వెంటే వినికిడి లోపం రావడం ఖాయం..!

తోటపని కోసం ఉపయోగించే మెషీన్లు,  ఎలక్ట్రానిక్ వస్తువులు చేసే శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది.  వీటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.

సంగీతం వినడానికి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్లు  వాడటం కామన్. కానీ రోజులో 60శాతం కంటే ఎక్కువసేపు వీటితో సంగీతం వెంటే వినికిడి సమస్యలు తొందరగా వస్తాయి.

క్లబ్బులలోనూ, లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ లలోనూ సౌండ్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వినికిడి ప్రమాదాన్ని పెంచుతాయి.

పటాకులు, బాంబ్ లు,  అధిక శబ్దాన్ని ఉత్పత్తి చేసే ఇతర క్రాకర్స్ నుండి వెలువడే శబ్దాలు షాక్ వేవ్ లు గా పనిచేస్తాయి. ఇవి చెవి లోపలి కణాలను దెబ్బ తీస్తాయి.

సినిమా థియేటర్లు, ఆర్కేడ్ లు వంటి ప్రదేశాలలో వెలువడే శబ్దాలు కూడా వినికిడి సమస్యలకు కారణం అవుతాయి.

షూటింగ్ వంటివి ప్రాక్టీస్ చేసేటప్పుడు లేదా అలాంటి చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  ఒక్క షాట్ గన్ పేలుడు కూడా వినికిడి లోపానికి కారణం అవుతుంది.

మోటారు సైకిల్లు, పడవలు 95-100 డెసిబుల్స్ శబ్దాన్ని విడుదల చేస్తాయి. ఇవి వినికిడిని దెబ్బతీస్తాయి.

ఇంటి మరమ్మత్తు పనులు,  కట్టడాలు జరుగుతున్న చోట వెలువడే శబ్దాలు వినికిడి సమస్యను  కలిగిస్తాయి.