ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు..  తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..!

బాదంలో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా జుట్టు నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

క్యారెట్లలో బీటా కెరోటిన్, విటమిన్-ఎ ఉంటాయి.  ఇవి జుట్టు మూలాల ఆరోగ్యానికి అవసరమైన సహజ నూనెలు ఉత్పత్తి చేసి జుట్టును నల్లబరుస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి పుష్కలంగా ఉండే ఉసిరి జుట్టును నల్లగా నిగనిగలాడేలా చేస్తుంది. జుట్టు నెరవడాన్ని ఆలస్యం చేస్తుంది.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటి బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి.  హెయిర్ ఫోలికల్స్ ను కాపాడి జుట్టును నల్లగా ఉంచుతాయి.

ప్రోటీన్, విటమిన్, ఒమేగా-3 పుష్కలంగా ఉండే సాల్మన్ చేపలు స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడి జుట్టు నల్లగా మారేలా చేస్తాయి.

పాలకూర, బచ్చలికూర, మెంతికూర,  తోటకూర వంటి ఆకు కూరలు జుట్టును నల్లగా మారేలా చేస్తాయి. వీటిలో విటమిన్-ఎ, విటమిన్-సి, ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.

మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో వాల్నట్ లు సహాయపడతాయి. ఇందులో ఉండే కాపర్ జుట్టు రంగును నల్లగా మారుస్తుంది.