ఈ టీలు తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చట..!

టీ అనేది శరీరానికి ఆర్థ్రీకరణ, యాంటీ ఆక్సిడెంట్లు అందించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 7 రకాల టీలు బరువు తగ్గించడంలో బాగా పనిచేస్తాయి.

గ్రీన్ టీ.. గ్రీన్ టీలో EGCG వంటి కాటెచిన్ లు అధికంగా ఉంటాయి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో కొవ్వును, పొత్తి కడుపు కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

బ్లాక్ టీ.. బ్లాక్ టీ లో థెఫ్లావిన్స్, థియారూబిగిన్స్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడతాయి.

ఊలాంగ్ టీ.. పాలీఫెనోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉండే ఊలాంగ్ టీ కొవ్వు తొందరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడంలో సహకరిస్తుంది.

పిప్పరమెంటు టీ.. పిప్పరమెంటు టీ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పదే పదే ఆకలి వేయడాన్ని అరికడుతుంది. ఇందులో కేలరీలు ఉండవు. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అల్లం టీ.. అల్లం టీ జీవక్రియను మెరుగుపరిచి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.

మందార టీ.. మందార టీలో కేలరీలు ఏమీ ఉండవు. ఇందులో ఉండే ఆంథోసైనిన్స్ వంటి సమ్మేళనాలు కార్బోహైడ్రేట్ శోషణను నిరోధిస్తాయి.  పిండి పదార్థాలు చక్కెరలుగా మారకుండా చేస్తాయి.

రూయిబోస్ టీ.. రూయిబోస్ టీ దక్షిణాఫ్రికా రెడ్ బుష్ ప్లాంట్ నుండి లభ్యమవుతుంది. ఇది కెఫిన్ ఫ్రీ పానీయం. దీంట్లో ఆస్పలాథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటాయి.