పులులు, సింహాల కంటే అత్యంత ప్రమాదకరమైన 10 జీవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిత్యం మన చుట్టూ ఉండే దోమల వల్ల మలేరియా, డెంగ్యూ తదితర ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. కొన్నిసార్లు ఇవి మరణానికి దారి తీయొచ్చు.
బాక్స్ జెల్లీ ఫిష్ విషం చాలా ప్రమాదం. ఈ విషం శరీరంలోకి వేగంగా పాకడంతో పాటూ ప్రాణాలు కూడా తీస్తుంది.
కేప్ బఫెలో అనే గేదె చాలా దూకుడు స్వభావం కలది. ఆఫ్రికాలో దీని కారణంగా ఎక్కువ మంది చనిపోయారు.
ఉప్పు నీటి మొసలి కూడా ఎంతో ప్రమాదకరమైనది. దీని కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు.
ఆఫ్రికన్ ఏనుగులు వల్ల కూడా ఆ దేశంలో చాలా మంది చనిపోయారు.
పాయిజన్ డార్ట్ అనే కప్ప చూసేందుకు అందంగా ఉంటుంది. కానీ దీని విషం పక్షవాతం లేదా మరణానికి దారి తీస్తుంది.
ధ్రువపు ఎలుగుబంట్లు తరచూ మనుషులపై దాడులు చేస్తుటాయి. వీటి వల్ల కూడా చాలా మంది చనిపోయారు.
ఆఫ్రికనైజ్డ్ తేనెటీగలు అత్యంత దూకుడుగా ఉంటాయి. వీటి దాడి కారణంగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.
Tsetse అనే ప్రమాదకర వ్యాధిని వ్యాప్తి చేసే ఈగలు వల్ల కూడా అనేక మంది మృత్యువాత పడ్డారు.
దక్షిణ అమెరికాలో కనిపించే అసాసిన్ బగ్ అనే పురుగు మనుషుల రక్తం పీలుస్తుంది. దీని కారణంగా ఏటా 10,000 మంది చనిపోతున్నారని అంచనా.