ప్రపంచంలోని 10 నిశ్శబ్ధ, ఆహ్లాదకరమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రశాంతతను కోరుకునే వారికి ఈక్వెడార్‌లోని జబాలో నది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. 

హవాయిలోని హలేకాలా క్రేటర్ ప్రాంతంలో సూర్యోదయం, సూర్యాస్తమయం ఎంతో అందంగా ఉంటుంది.

యూఎస్ మోంటనాలోని గ్లేసియర్ నేషనల్ పార్క్ మంచు శిఖరాలు, అడవులతో నిండి ఉంటుంది. 

పచ్చదనంతో నిండిన ఫిన్లాండ్‌లోని క్వార్కెన్ ద్వీప సమూహం ప్రశాంతతకు నిలయంగా ఉంటుంది. 

కెనెడాలోని గ్రాస్‌ల్యాండ్స్ నేషనల్ పార్క్.. పచ్చిక భూములతో ఎంతో అందంగా ఉంటుంది. 

ఇసుక ర్యాంప్‌లతో కూడిన కాలిఫోర్నియాలోని కెల్సో డ్యూన్స్ ప్రాంతం మంచి అనుభూతిని కలిగిస్తుంది. 

స్వీడన్‌లోని లాప్లాండ్ ప్రాంతం కూడా ప్రశాంతతకు నిలయమని చెప్పొచ్చు. 

ప్రశాంతంగా వీచే గాలులు, మంచు పర్వతాలతో అంటార్కిటికా ప్రాంతం కూడా ఎంతో అలరిస్తుంది. 

ఐస్లాండ్‌లోని రంగు రంగుల పర్వతాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. 

యూకేలోని స్కాటిష్ హైలాండ్స్.. పర్వతాలు, సరస్సులు, పూల లోయలతో అందంగా ఉంటుంది.