తల్లిదండ్రులు పిల్లల మీద గట్టిగా అరిస్తే జరిగే పరిణామాలు ఇవే..!
పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడే కాదు.. తల్లిదండ్రులు ఏదైనా కోపం, అసహసనంలో ఉన్నప్పుడు పిల్లల మీద గట్టిగా అరుస్తుంటారు.
పిల్లల మీద పదే పదే అరవడం వల్ల పిల్లలు అభద్రతా భావానికి లోనవుతారు. ఇది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
తల్లిదండ్రులు పిల్లల మీద కేకలు వేస్తుంటే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య బంధం దెబ్బతింటుంది. పిల్లలు తల్లిదండ్రులతో ఏమీ చెప్పుకోలేరు, కమ్యూనికేషన్ తగ్గిపోతుంది.
తల్లిదండ్రులు పిల్లల మీద అరుస్తుంటే పిల్లలు తల్లిదండ్రుల నుండి అదే నేర్చుకుంటారు. ఎదుటివారి మీద అరవడం సరైనదే అని అనుకుంటారు.
తల్లిదండ్రులు పిల్లల మీద అరుస్తుంటే పిల్లలు ఒత్తిడికి లోనవుతారు. ఇది వారిలో నేర్చుకునే సామర్థ్యాన్ని, ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.
పిల్లల ప్రవర్తనను సరిదిద్దడానికి బదులు వారి మీద అరిస్తే వారిలో తిరుగుబాటు ధోరణి, వ్యతిరేకత పెరుగుతాయి.
తల్లిదండ్రులు పిల్లల మీద అరుస్తుంటే ఇంట్లో భయం ఆధారిత వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలు తమ తప్పు తెలుసుకోకుండా తప్పించుకోవడం మీద దృష్టి పెడతారు.
తల్లిదండ్రులు ఎప్పుడూ అరుస్తూ ఉంటే పిల్లలలో ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం దెబ్బతింటాయి.