ఈ 8 కూరగాయలను.. ఇంట్లో ఉండే గార్డెన్‌లోనూ పెంచొచ్చు..!
క్యారెట్లను చలికాలంలో 24*12 అంగుళాల గ్రో బ్యాగ్ లో పండించాలి. 15 నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రతలో ఇవి బాగా పండుతాయి.
చలికాలంలో పాలకూరను ఇంట్లో ఓ టబ్ లో అయినా చాలా ఈజీగా పెంచవచ్చు.
సొరకాయను కుండీలలో లేదా గ్రో బ్యాగ్ లో పెంచుకోవచ్చు. ఈ మొక్కలకు ప్రతిరోజూ 5-6 గంటల సేపు సూర్యరశ్మి తగిలితే బాగా కాస్తాయి.
ఉల్లి పొరకలు లేదా పచ్చి ఉల్లిపాయలను విత్తనాలు తెచ్చి వేస్తే ఇంట్లోనే ఈజీగా కుండీలో పెరుగుతాయి.
చలికాలంలో బెండకాయలు బాగా పండుతాయి. బాగా ఎండిన మట్టిని బెండకాయలు పండించడానికి ఉపయోగించాలి. ఆవు పేడతో కంపోస్ట్ వేసి పెంచాలి.
నాటిన తరువాత నెలలోపే టమోటాల దిగుబడి ఉంటుంది. చలికాలంలో వీటి పెరుగుదల బాగుంటుంది.
క్యారెట్ లాగే ముల్లంగి చలికాలంలో బాగా పండుతాయి. తేమతో కూడిన వాతావరణం దీని పెరుగుదలకు బాగుంటుంది.
గ్రో బ్యాగ్ లో బీట్ రూట్ పండించవచ్చు. వీటి విత్తనాలు తేలికగా ఉన్న మట్టిలో బాగా ఎదుగుతాయి. అందుకే ఇసుక లోమ్ నేలల్లో వీటిని పండించాలి.