అమ్మాయిల్లో.. అబ్బాయిలు ఏం గమనిస్తారో తెలుసా

అమ్మాయిని తొలిసారి కలిసినప్పుడు అబ్బాయి గమనించేది ఆమె ముఖంలో నవ్వేనట. ఆమె తనతో ఇష్టంగా మాట్లాడుతుందా, బలవంతంగానా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆమె నవ్వు సూచికగా పని చేస్తుందట.

అమ్మాయిలో ఆమె ఆత్మవిశ్వాసం కంటే ఆకర్షణీయమైనది మరోటి లేదు. దీన్ని కూడా అబ్బాయి గమనిస్తాడు.

అమ్మాయిల డ్రెసింగ్ స్టైల్, కాస్ట్యూమ్స్‌ని కూడా అబ్బాయిలు గమనిస్తూ ఉంటారు. 

ఎత్తు, బరువు, రంగు తదితర విషయాలను కూడా అబ్బాయిలు అబ్జర్వ్ చేస్తారు. 

మీకున్న స్నేహితులు, వ్యక్తిగత ప్రాధాన్యతలు ఏంటో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. 

తొలిసారి కలిసిన వెంటనే అబ్బాయిల చూపులు నేరుగా అమ్మాయిల కళ్లపైకి వెళ్తాయి. మాటలు మాట్లాడటంలో ఫెయిలైనా.. కళ్లు మనసులోని భావాన్ని చెబుతాయని అబ్బాయిలు భావిస్తారు. 

ఒక వ్యక్తి తాను కలిసిన అమ్మాయి గురించి అన్ని వివరాలు గుర్తుపెట్టుకోకపోవచ్చు. కానీ ఆమె శరీరం నుంచి వచ్చే వాసనను కచ్చితంగా గుర్తించుకుంటాడు. ఆమె శరీరం నుంచి వచ్చే సువాసనను అస్సలూ మర్చిపోలేడు.