స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ తొలి చూపులోనే మొదలవుతుంది. మరి పురుషులను చూడగానే మహిళలు గమనించేవి ఏంటంటే..

శరీర దుర్వాసన మహిళల్లో ఏవగింపు కలిగిస్తుందట. కాబట్టి, పురుషులు పరిశుభ్రంగా ఉండాలి. పర్‌ఫ్యూమ్ అలవాటు చేసుకోవాలి

 హెయిర్ స్టైల్ ఎలా ఉందనేది కూడా మహిళలు పరిశీలిస్తారు.

చేతికి వాచ్ లేదా బ్రేస్‌లెట్స్ వంటివి పెట్టుకోవడం పురుషులకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది

పురుషుల లుక్ ఇనుమడింప చేయడంలో షూస్ పాత్ర కీలకం. కాబట్టి సందర్భానికి తగినట్టు షూస్ ధరించాలి

క్లీన్ షేవ్‌తో శుభ్రంగా ఉండేవాళ్లు, కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడేవాళ్లు మరింత ఆకర్షణీయంగా ఉంటారు

నిత్యం నవ్వు ముఖంతో ఉండే పురుషులపై మహిళల్లో సానుకూల దృక్పథం ఉంటుంది.

మనిషి కళ్లల్లో అతడి వ్యక్తిత్వం కనిపిస్తుందని అంటారు. పురుషుల చూపుల ఆధారంగా మహిళలు ఓ అంచనాకు వస్తారట

నలుగురితో కలుపుగోలుగా ఉంటూ కాన్ఫిడెంట్‌గా ఉండే పురుషుల వైపు మహిళలు అధికంగా ఆకర్షితులవుతారట

సందర్భానికి తగినట్టు డ్రెస్ వేసుకునే వాళ్లు కూడా మహిళల దృష్టిలో ఈజీగా పడతారు.