ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల ట్రెండ్ నడుస్తోంది. పర్యావరణానికి హితకరమైన వీటిని కొనేటప్పుడు ఏ అంశాలపై దృష్టిపెట్టాలంటే..

ఎలక్ట్రిక్ స్కూటీలకు బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. మంచి రేంజ్ ఉన్నది ఎంచుకోవాలి.

చార్జింగ్ స్టేషన్లు సులువుగా అందుబాటులో ఉండాలన్న విషయం మర్చిపోవద్దు. హోం చార్జింగ్‌ అంశంపై కూడా దృష్టి పెట్టాలి.

ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించొచ్చనే అంశాన్ని కూడా పరిశీలించాలి. ఇది చాలా ముఖ్యం

స్కూటీ గరిష్ఠ వేగం ఎంత ఉందో కచ్చితంగా తెలుసుకోవాలి. నగరాల్లోని వారికి ఇది మరీ ముఖ్యం

జీపీఎస్, నావిగేషన్ సర్వీసులు ఉన్నవి ఎంచుకోవడం కూడా అవసరం

దూరం నుంచే స్కూటీపై ఓ కన్నేయగలిగేలా యాప్ కనెక్టివిటీ ఉందో లేదో చూసుకోవాలి.

ఎలక్ట్రిక్ స్కూటీలకు మంచి బ్రేకులు చాలా అవసరం. ఈ అంశాన్ని కూడా మర్చిపోవద్దు

చోరీ సమస్యను తగ్గించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్ ఫీచర్లు ఉన్న స్కూటీనే ఎంచుకోవాలి

మనకు కావాల్సిన ఫీచర్లన్నీ ఉన్న పలురకాల బ్రాండ్లను పరిశీలించి అందుబాటు ధరలో ఉన్నదాన్ని ఎంపిక చేసుకోవాలి. 

సకాలంలో సర్వీస్ చేయించేందుకు వీలుగా కంపెనీకి మంచి సర్వీస్ నెట్వర్క్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి.