ఈ 10 పక్షులను కొనాలంటే ఆస్తులమ్మినా చాలదు..

హైసింత్ మాకా

దక్షిణ అమెరికాకు చెందిన హైసింత్ మాకా చిలుకల ధర 11లక్షల నుండి 58లక్షల రూపాయల మధ్యలో ఉంటాయి. ఇవి చాలా అందమైనవి, మరింత తెలివైనవి.

బ్లాక్ పామ్ కాకాటూ

చిలుక జాతిలో నల్లటి ఈకలున్న అతిపెద్ద చిలుకలు ఇవి. వీటికి కోపం కూడా చాలా ఎక్కువ. వీటి ధర రూ. 8లక్షల నుండి 50లక్షల వరకు ఉంటుంది.

గౌల్డియన్ ఫించ్

ఇవి ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షులు. వీటి ధర రూ 2 లక్షల నుండి రూ.  8లక్షల వరకు ఉంటుంది.

స్కార్లెట్ టానేజర్

ఈ పక్షులు చాలా  అందంగా ఉంటాయి.  వీటి అరుపు చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. వీటి ధర రూ 41 వేల నుండి  రూ.1,66వేల వరకు ఉంటుంది.

నార్తెన్ కార్టినల్

ఈ పక్షులు ఎర్రని ఈకలతో నల్లని అంచులతో భలే ముద్దొస్తాయి. వీటి అరుపు వినసొంపుగా ఉంటుంది. తోటల్లో, పెరట్లో కనిపిస్తుంటాయి. వీటిని పెంచుకోవాలంటే మాత్రం రూ.16 వేల నుండి రూ. 66 వేల వరకు ఖర్చు పెట్టాలి.

వైట్ పికాక్

తెల్ల నెమలి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతారు. వీటి ధర రూ.83వేల నుండి రూ.4లక్షల వరకు ఉంటుంది.

పింక్ ఫ్లెమింగో

పింక్ ఫ్లెమింగో పక్షులు ఉష్ణమండలం పక్షులు. వీటి ధర 1,66లక్షల నుండి  రూ.4,16 లక్షల వరకు ఉంటుంది.

టౌకాన్

ఈ పక్షులు విభిన్న రంగుల కలయికతో ఉంటాయి. వీటి ముక్కు చాలా ఆకర్షణగా ఉంటుంది. వీటి ధర రూ.16వేల నుండి రూ.1,66లక్షల వరకు ఉంటుంది.

అయామ్ సెమని

ఇది నలుపు రంగులో ఉన్న కోడి. దీని ఈకలు, చర్మం నుండి లోపలి మాంసం వరకు అంతా నలుపే. అదృష్టం తెచ్చి పెడుతుందని నమ్ముతారు. దీని ధర రూ.16వేల నుండి రూ.2లక్షల వరకు ఉంటుంది.

రేసింగ్ పావురాలు

ఈ పావురాలు బాగా ట్రైనింగ్ తీసుకుని ఉంటాయి. గంటకు 70మైళ్ల వేగంతో ఎగురుతాయి. వీటి తెలివితేటలు అయితే అమోఘం. వీటి ధర రూ.8కోట్ల   నుండి   12వేల కోట్ల వరకు ఉంటుంది.