కొన్ని పక్షులు ఖండాలు దాటి వెళ్లి మళ్లీ వెనక్కు తిరిగొస్తాయి. వీటిని మైగ్రేటరీ పక్షులని అంటారు.

ఈ మైగ్రేటరీ పక్షుల్లో కామన్ స్విఫ్ట్ పక్షి చాలా ప్రత్యేకమైనది

ఇది 10 నెలల పాటు దాదాపు ఎక్కడా వాలకుండా ఏకధాటిగా గాల్లో ప్రయాణిస్తుంది

ఐరోపా నుంచి ఆఫ్రికాకు వచ్చి మళ్లీ ఇవి తిరిగెళ్లిపోతాయి

తక్కువ శక్తితో నిరంతరం గాల్లో ఎగిరేందుకు వీలుగా వీటి శరీరాకృతి, రెక్కల నిర్మాణం ఉంటుంది

గాల్లో ఎగురుతూనే ఇవి ఆహారం తింటాయి, జంటతో జతకూడతాయి.

వీటి రెక్కలు పొడుగ్గా, కాళ్లు పొట్టిగా ఉండటంతో ఇవి చెట్ల కొమ్మలు మినహా నేల మీద వాలలేవు

వలసొచ్చే క్రమంలో ఇవి కేవలం 0.64 శాతం సమయం మాత్రమే ఎక్కడైనా వాలి సేదతీరుతాయట