ఊరి పేరు ఒమ్యాకోన్, రష్యాలోని  సైబీరియా ప్రాంతంలో ఉంది

ప్రపంచంలో మనుషులు ఉంటున్న అతి చల్లని ప్రాంతం ఇదే

అందుకే ‘కోల్డెస్ట్​ విలేజ్​ ఆఫ్​ వరల్డ్​’గా గుర్తింపు తెచ్చుకుంది

ఇక్కడ చలికాలంలో సగటు ఉష్ణోగ్రత –50 డిగ్రీల సెల్సియస్

ఒమ్యాకోన్ సిటీలకు చాలా దూరంగా ఉండే మారుమూల గ్రామం

ప్రస్తుతం ఇక్కడ సుమారు 500 మంది ఉంటున్నారు

ఇక్కడివాళ్లు చలి నుంచి తట్టుకోవడానికి ‘రుస్కీ’ అనే రష్యన్ టీని రెగ్యులర్​గా తాగుతారు

చలి వల్ల ఈ ప్రాంతంలో పంటలు పండవు

కాబట్టి అక్కడివాళ్లకు పశుపోషణే జీవనాధారం

ముఖ్యంగా రెయిన్ డీర్లను పెంచుతారు

కొందరు వేటాడడం, చేపలు పట్టడం లాంటి సంప్రదాయ వృత్తుల మీద కూడా ఆధారపడతుంటారు