ఈ ఆహారాలు తినండి చాలు.. ముఖం మీద ముడతలు మాయం..

వయసు పెరిగేకొద్ది చర్మం ముడుతలు పడటం సాధారణం.

ముఖం మీద కనిపించే ముడతలు చాలా తొందరగా వయసును బయట పెడతాయి.

కొన్ని ఆహారాలు తీసుకుంటే ముఖం పై ముడతలు తగ్గి చర్మం తిరిగి యవ్వనంగా మారుతుంది.

వాల్ నట్స్, బాదం పప్పులలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి.

బెర్రీ జాతి పండ్లలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు, పైబర్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

గ్రీన్ టీ లో కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని శుధ్ది చేసి వృద్దాప్యానికి లోను కాకుండా చేస్తుంది.

అవకాడోలో ఆరోగ్యకరైన కొవ్వులు, విటమిన్-ఇ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైట్రేడ్ గా బిగుతుగా ఉంచుతాయి.

పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి.  ఇవి చర్మానికి సహజ మెరుపును ఇస్తాయి.