భారతదేశంలో లక్ష్మిదేవి పూజలు అందుకునే కొన్ని దేవాలయాలు చాలా అద్బుతంగా ఉంటాయి.
మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్..
శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారి దేవాలయం మహారాష్ట్రలో ఉంది. ఇక్కడి వాస్తుశిల్పం, చరిత్ర అమోఘం.
పద్మావతి ఆలయం, తిరుచానూరు..
తిరుపతికి సమీపంలో ఉన్న తిరుచానూరులో లక్ష్మీ స్వరూపమైన పద్మావతి అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ పూజలు చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు లభిస్తాయట.
లక్ష్మీనారాయణ దేవాలయం, ఢిల్లీ..
ఢిల్లీ లోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని బిర్లా టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ లక్ష్మీదేవికి పూజలు చేస్తారు.
అష్టలక్ష్మీ దేవాలయం, చెన్నై..
లక్ష్మీ దేవి 8 రూపాలను సూచించే 8 మందిరాలు ఈ ఆలయంలో ఉన్నాయి. దక్షిణ భారత వాస్తుశిల్పం ఇక్కడ అందంగా ఉంటుంది.
మహాలక్ష్మీ దేవాలయం, ముంబై..
19 వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా నవరాత్రి వేడుకలు ఇక్కడ బాగా జరుగుతాయి.
లక్ష్మీనారాయణ దేవాలయం, ఓర్చా..
మధ్యప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయం కోట, ఆలయం తో కలిసిపోయి ఉంటుంది. ఇక్కడ కుడ్య చిత్రాలు , అమ్మవారి దేవతామూర్తి రూపం చాలా అందంగా ఉంటాయి.
లక్ష్మీనరసింహ ఆలయం, అంతర్వేది..
బంగాళాఖాతం, గోదావరి నది సంగమ ప్రదేశంలో అంతర్వేది ఆలయం ఉంది. ఇక్కడ నరసింహ స్వామి లక్ష్మీ సమేతుడై ఉంటాడు.
లక్ష్మీదేవి ఆలయం, దొడ్డగడ్డవల్లి..
కర్ణాటకలో ఉండే ఈ లక్ష్మీదేవి ఆలయం హోయసల శైలిలో నిర్మితమైన పురాతన ఆలయం. ఇక్కడి శిల్పకళ అద్బుతంగా ఉంటుంది.
శ్రీలక్ష్మీ వరాహ దేవాలయం, సింహాచలం..
ఈ దేవాలయంలో నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయంలో వైష్ణవ సంప్రదాయంలో పూజలు జరుగుతాయి.