వైద్య శాస్ర్తంలో ముద్దుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ముద్దు పెట్టుకోవడం వల్ల హార్మోన్లు రిలీజ్ అవుతాయని, ఒత్తిడి తగ్గుతుందని అంటారు
భర్త బయటకు వెళ్లే ముందు తన భార్యకు 6 సెకెన్ల పాటూ ముద్దు పెదవి ముద్దు ఇవ్వాలట.
నిజానికి మగవారి కంటే మహిళలు భార్యాభర్తల మధ్య సంబంధం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, ఆందోళన చెందుతారు. 6సెకెన్ల ముద్దు వల్ల ఈ ఆందోళన తగ్గుతుంది.
6 సెకెన్ల పాటూ భార్యకు ముద్దు పెట్టడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది.
భార్య మనసులో ఏదైనా బాధ, తమ బంధం విషయంలో అభద్రతా భావం వంటివి ఉంటే అవన్నీ మాయమవుతాయట.
ముద్దుకు 6 సెకెన్లు టైం సెట్ చేసినట్టే కౌగిలింతకు కూడా టైమ్ సెట్ చేశారు. 20 సెకెన్ల కౌగిలి వల్ల భార్యాభర్తల మధ్య ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది.
ఆక్సిటోసిన్ అనేది ప్రేమ హార్మోన్. దీన్ని కడల్ కెమికల్ అని కూడా పిలుస్తారు. ఇది మానసిక ఆరోగ్యానికి ముఖ్యమైనది.