కావలసిన పదార్థాలు..
ఎండబెట్టిన గురివింద గింజలు..
నువ్వుల నూనె..
భృంగరాజ్ రసం..
ఎలా చేయాలి..
గురివింద గింజలను బాగా ఎండబెట్టాలి. తరువాత వీటిని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిలో భృంగరాజ్ రసం పోయాలి. దీన్ని పేస్ట్ లాగా చేయాలి.
ఒక పాన్ లో కొద్దిగా నువ్వుల నూనె పోయాలి. అందులో గురివింద గింజల పేస్ట్ వేయాలి. ఇందులో ఇంకొంచెం భృంగరాజ్ రసం పోయాలి.
సన్నని మంట మీద దీన్ని ఉడికించాలి. భృంగరాజ్ రసం అంతా ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలేవరకు నూనెను ఉడికించాలి.
నూనె ఉడికిన తరువాత దీన్ని కొన్ని గంటల పాటు అలాగే ఉంచి చల్లారనివ్వాలి.
నూనె చల్లారిన తరువాత ఫిల్టర్ చేసి గాజు సీసాలో భద్రపరచాలి.
వారానికి రెండుసార్లు ఈ నూనెను తలకు అప్లై చేసి గంట ఆగిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే ఒత్తుగా, మందంగా ఉన్న జుట్టు సొంతమవుతుంది.