258b32a4-1ead-4eeb-9e9b-a7bb2abf2afe-moringa2.jpg

రుచికరమైన మునగాకు రైస్.. ఇలా చేస్తే అదుర్స్..

105401ad-cfb1-4bbe-a445-1bc1d3351e52-moringa.jpg

మునగ కాయలే కాదు మునగ  ఆకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

13aac204-ae6f-4f09-8e4b-38ced5733566-moringa1.jpg

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడం నుండి ఐరన్ అందించి హిమోగ్లోబిన్ పెంచడం వరకు మునగ ఆకు బోలెడు మ్యాజిక్ చేస్తుంది

09fc516e-c8c3-4750-b3d3-9097a4117dc0-moringa3.jpg

మునగ ఆకుతో రైస్ చేసుకుని రుచికరంగా ఆస్వాదించవచ్చు.

కావలసిన పదార్థాలు.. పొడి కోసం.. నూనె.. స్పూన్.. వెల్లుల్లి.. 3-4 ఎండుమిరపకాయలు.. 2-3 చింతపండు.. కొద్దిగా శనగపప్పు.. 2 టేబుల్ స్పూన్లు మినపప్పు.. 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర.. 1స్పూన్ మిరియాలు.. కొద్దిగా దనియాలు.. 1 టేబుల్ స్పూన్ నువ్వులు.. 1 టీస్పూన్ మునగ ఆకులు.. 1కప్పు పసుపు.. అర స్పూన్ ఇంగువ.. కొద్దిగా ఉప్పు.. రుచికి సరిపడా

పోపు కోసం.. అన్నం.. రెండు కప్పులు నూనె.. 1 టేబుల్ స్పూన్ ఆవాలు.. 1 స్పూన్ మినపప్పు.. అర స్పూన్ శనగపప్పు.. అర స్పూన్ వేరుశనగ.. పావు కప్పు జీడిపప్పు.. 5-6 ఎండుమిర్చి.. 2 కరివేపాకు.. ఒక రెమ్మ

ఇలా చేయాలి.. పాన్ లో నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు, చింతపండు వేసి ఒక నిమిషం వేయించాలి. శనగపప్పు, మినపప్పు,  మిరియాలు, జీలకర్ర,  దనియాలు, నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి.

దోరగా వేగిన దినుసులలో మునగ ఆకులు కూడా వేసి ఆకులు పచ్చిదనం పోయేవరకు వేగించాలి.  తరువాత ఇందులో ఉప్పు వేసి చల్లారాక మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి.

స్టౌ మీద కడాయి పెట్టి అందులో టేబుల్ స్పూన్ నూనె వేసి ఆవాలు, వేరుశనగ, జీడిపప్పు వేసి వేయించాలి.  అందులోనే పోపు దినుసులు అన్నీ వేసి వేయించుకోవాలి.

పోపులో రెండు కప్పుల అన్నం వేసి కలపాలి. ఇందులో తయారు చేసుకున్న మునగ ఆకుల పొడి రెండు నుండి మూడు స్పూన్లు వేసి బాగా కలపాలి. ఉప్పు చెక్ చేసుకుని తక్కువైతే మరికాస్త వేసుకోవాలి.

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే  మునగ ఆకుల రైస్ సిద్దమైనట్టే..