సాధారణంగా అన్నిరకాల జంతువులకూ ఒకే తల ఉంటుంది. అయితే పాముల నుంచి తాబేలు వరకూ కొన్నింటికి రెండు తలలు ఉంటాయి. అవేంటంటే..
కొన్ని రకాల కోళ్లకూ రెండు తలలు ఉంటాయి. వీటిని సియామీ కవలలు అని కూడా పిలుస్తుంటారు.
చరిత్రలో రెండు తలల పిల్లలు కూడా ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
గార్టెర్ అనే రకం పాములు రెండు తలలను కలిగి ఉంటాయి.
రెడ్-ఇయర్డ్ స్లయిడర్ అనే రకం తాబేళ్లు కూడా రెండు తలలు కలిగి ఉంటాయి.
అమెరికన్ బుల్ ఫ్రాక్ రకం కప్పలు కూడా రెండు తలలు కలిగి ఉంటాయని తెలిసింది.
డ్రాగన్ ఆకారంలో ఉండే కొన్ని రకాల బల్లులకూ రెండు తలలు ఉంటాయి.
కొన్ని రకాల బీటిల్స్ జీవులు జన్యు లోపాల కారణంగా రెండు తలలో జన్మిస్తుంటాయి.
రెండు తలల ఉడుతలు కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇవి చాలా అరుదు మాత్రమే.
ఇక రెండు తలలో జన్మించే మేకలు, గొర్రెలు, ఆవులను కూడా చూస్తుంటాం. అయితే ఇలాంటివి చాలా తక్కువ కాలం మాత్రమే బతుకుతుంటాయి.