ఇంటి గార్డెన్ కోసం ఇలా...
ముందుగా స్థలం
ఎంపిక చేసుకోవాలి.
ఐదారు గంటల పాటు సూర్యరశ్మి నేరుగా పడే స్థలానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
స్థలం ఎంపిక చేసుకున్న తరువాత మొక్కల ఎంపిక చేపట్టాలి.
పూల మొక్కలు కావాలా, హెర్బ్స్ పెంచుకుంటారా, కూరగాయల మొక్కలకు ప్రాధాన్యం ఇస్తారా, అన్నది ముందుగా నిర్ణయించుకోవాలి
నల్లరేగడి మట్టి మొక్కల పెంపకానికి అనువైనది.
వర్మీ కంపోస్ట్, ఎరువులు కలుపుకోవడం ద్వారా నేలలో మొక్కలకు కావలసినంత పోషకాలు లభించేలా చేయవచ్చు.
మొక్కలు ఎంపిక చేసుకునే ముందు మొక్కలు పెరిగే
ఎత్తును దృష్టిలో ఉంచుకోవాలి.
పూలమొక్కలు, పొదల్లా పెరిగే మొక్కలు, తీగలతో అల్లుకుపోయే మొక్కల్లో మీ స్థలం, అభిరుచిని బట్టి ఎంచుకోవాలి
పూల మొక్కలు గార్డెన్‌ను ఆకర్షణీయంగా మారుస్తాయి.
మొక్కలు పెంచుకోవడానికి కుండీలు ఎంపిక చేసుకోవాలి.
టొమాటో, పాలకూర, ముల్లంగి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వంటి ఆకుకూరలు, దుంపలను వెడల్పాటి టబ్బుల్లో పెంచుకోవచ్చు.
స్థలం ఎక్కువగా ఉంటే బీర, కాకర, చిక్కుడు వంటి తీగలు పారే మొక్కలను పెంచుకోవచ్చు.
మొక్కలు నాటిన మొదటి వారంలో రోజూ నీరు పట్టాలి.
రెండవ వారం నుంచి రెండు రోజులకొకసారి నీరు పడితే సరిపోతుంది.
మొక్కలు బాగా పెరిగాక వారానికొకసారి నీరు పట్టొచ్చు.
అయితే ఇది అన్ని మొక్కలకు వర్తించదు. కొన్ని రకాల పూల మొక్కలకు ప్రతి రోజూ నీరు పట్టాల్సి ఉంటుంది.
కుండీలో మొక్కను నాటే ముందు దాని అడుగు భాగాన చిన్న రంధ్రం ఉండేలా చూసుకోవాలి.
కుండీలో మట్టిని అదమకుండా బోలుగా ఉండేలా చూసుకోవాలి. మొక్కను నాటేటప్పుడు వేర్లు పూర్తిగా మట్టిలో కూరుకునేలా పెట్టాలి.
Related Web Stories
రుచికరమైన వెజ్ తహ్రి రైస్.. తింటే అస్సలు వదలరు!
భారత్‌లో వాయుకాలుష్యం అత్యల్పంగా ఉన్న ప్రాంతాలు ఇవే!
పిల్లలకు చదువుతో పాటు ఇవి కూడా ముఖ్యం..!
ఇలా అయితేనే సూర్యుడి నుంచి మనకు తగినంత విటమిన్-డి అందుతుంది..