చూపులేనిదే ప్రపంచం లేదు. కాబట్టి, కంటి చూపును కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

రెగ్యులర్‌గా కంటి చెకప్ చేయించుకోవాలి. తద్వారా సమస్యలను ముందుగానే గుర్తించొచ్చు

వంశపారంపర్య సమస్యలు ఉన్నాయేమో చూడాలి. వీటి గురించి డాక్టర్‌కు ముందుగానే చెప్పాలి

పోషకాహారం కంటి చూపును రక్షిస్తుంది. విటమిన్ ఏ, విటమిన్, విటమిణ్ ఈ ఉన్న ఆహారం తగినంత తినాలి

సూర్యరశ్మి నుంచి కంటిని కాపాడుకోవాలి. యూవీ కిరణాలు కంటి మీద పడకుండా కళ్లద్దాలు, టోపీల్లాంటివి ధరించాలి. 

స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లను ఎక్కువ సేపు చూడొద్దు. ప్రతి 20 నిమిషాలకు ఓసారి బ్రేక్ తీసుకోవడం ముఖ్యం

మద్యం, ధూమపానం కంటిపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఈ అలవాట్లకు దూరంగా ఉంటేనే మంచిది

రెగ్యులర్‌గా ఎక్సర్‌సేజులు చేస్తే ఆరోగ్యమే కాదు కంటి చూపు కూడా బాగుంటుంది

కంటి శుభ్రత విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. తరచూ కంటిని తాకడం, తుడుచుకోవడం వంటివి చేయొద్దు.