ఈ చిట్కాలతో..  QR కోడ్ స్కామ్‌‌కి చెక్ పెట్టండి

ఏ విధంగా అయితే అధునాతన సాంకేతికత అందుబాటులోకి వస్తోందో.. సైబర్ నేరాలు కూడా అలాగే పెచ్చుమీరిపోతున్నాయి.

డిజిటల్ ఇండియాలో భాగంగా వచ్చిన QR కోడ్ స్కానర్లను సైతం విడిచిపెట్టకుండా.. దోపిడీల కోసం వినియోగిస్తున్నారు.

ఏవో ఆఫర్లు, ఊరించే యాడ్స్‌తో పబ్లిక్ ప్లేసెస్‌లో QR కోడ్ స్కానర్లు పెట్టి, అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తున్నారు.

ఆ QR కోడ్‌లను స్కాన్ చేస్తే.. ఫిషింగ్ సైట్లు ఓపెన్ అవుతాయి. దాంతో, స్కామర్లు ఫోన్‌ని హ్యాక్ చేసి సమాచారం దొంగలిస్తారు.

అలా జరగకుండా ఉండాలంటే.. పబ్లిక్ స్పేస్‌లలో లేదా టెక్స్ట్‌ల నుండి వచ్చే QR కోడ్‌లను స్కాన్ చేయడాన్ని నివారించాలి.

URL ప్రివ్యూను చూపే QR కోడ్ స్కానర్ యాప్‌లను ఉపయోగించడం ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు.

థర్ట్ పార్టీ యాప్‌లను నివారించి.. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేయండి.

మాల్వేర్ నుండి మొబైల్ ఫోన్‌ని రక్షించుకోవడం కోసం.. భద్రతా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమం.

వ్యక్తిగత, ఆర్థిక సమాచారం అడిగే విశ్వసనీయత లేని సోర్సెస్ నుండి లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలి.