ఇంగ్లీషుతో ఇబ్బందా.. ఇలా చేస్తే అనర్గళంగా మాట్లాడొచ్చు
ఉద్యోగార్థులు, విద్యార్థులు, బిజినెస్‌మ్యాన్‌లు, పొలిటీషియన్లు ఇలా రంగమేదైనా ఇంగ్లీషులో పట్టు ఉండటం తప్పనిసరి.
అయితే చాలా మంది ఇంగ్లీషు మాట్లాడటంలో ఇబ్బందులు పడతారు. ఆంగ్లం అనర్గళంగా మాట్లాడటానికి ఇలా చేయండి..
కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఇంగ్లీషులో మాట్లాడండి
మాట్లాడుతున్న క్రమంలో కొత్త పదాలు ఏమైనా వాడారా, సరిగ్గానే మాట్లాడారా, తప్పులేమైనా దొర్లాయా అనే అంశాలను పరిశీలించండి. ఇలా ఆలోచిస్తే తరువాత మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఇంగ్లీషు సినిమాలు, వీడియోలు చూస్తూ పదాలను గమనించండి. ఆంగ్ల పుస్తకాలు చదవండి.
మాట్లాడేటప్పుడు ఫోన్లో రికార్డు చేసి వినండి. పదాల ఉచ్ఛరణ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి.
కొత్త పదాలు వస్తే వాటి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తరువాత ఆ పదాన్ని ఉపయోగించి వాక్యాలు నిర్మించండి.
ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంటే.. అద్దం ముందు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాక్టీస్ చేయండి. తద్వారా ఇంగ్లీష్‌పై పట్టు సాధించగలరు.