కొత్త భాషను సులువుగా నేర్చుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి. అవేంటో తెలుసుకుందాం పదండి

ముందుగా కొత్త భాషలోని టీవీ షోలు, సినిమాలు చూడాలి.

సబ్‌టైటిల్స్ లేకుండా సినిమాలు, టీవీ షోలూ చూస్తే భాషను త్వరగా నేర్చుకోవచ్చు

కొత్త భాషకు సంబంధించిన నాణ్యమైన పుస్తకాలు చదవాలి.

వీలైనంత త్వరగా కొత్త భాషలో మాట్లాడటం ప్రారంభించాలి.

కొత్త భాషలోని చిన్నారుల పుస్తకాలను బిగ్గరగా చదవితే త్వరగా భాషపై పట్టు వస్తుంది.

ఓ భాష పూర్తిగా నేర్చుకున్నాకే మరో భాషవైపు మళ్లితే తికమక లేకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చు

ఉచ్చారణలో తప్పిదాలు రాకుండా పదాలు పలకడంపై దృష్టి పెట్టాలి

భాష నేర్చుకునేందుకు రోజులో కొంత సమయం కేటాయించాలి. క్రమం తప్పకుండా షెడ్యూల్ ఫాలో కావాలి.