విద్యార్థులు తాము చదివింది మర్చిపోకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ తప్పనిసరిగా పాటించాలి.

మొదట ఎంచుకున్న టాపిక్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలి.

ఆ తరువాత ఆ అంశాన్ని మరెవరికైనా సులభమైన మాటల్లో వివరించాలి.

ఇలా వివరించే క్రమంలో తడబాటు కలిగించిన అంశాలను గుర్తించి వాటిపై మరింత అధ్యయనం చేయాలి

పుస్తకాలతో పాటు వీడియోలు, యానిమేషన్ల వంటి వివిధ మార్గాల్లో పాఠం నేర్చుకుంటే అది మనసులో నాటుకుంటుంది

నేర్చుకున్న అంశాల మధ్య సారూప్యతలు ఏమిటో విశ్లేషిస్తూ చదువుకుంటే మతిమరుపు సమస్య రాదు.

చదివినవి జ్ఞాపకం ఉండేందుకు  ఆరోగ్యం కూడా ముఖ్యం

పోషకాహారం, కంటినిండా నిద్ర.. జ్ఞాపకశక్తి పెంచుతాయి.