ముందుగా టికెట్ బుక్ చేయకున్నా.. తిరుమల వెంకన్నను ఇలా ఈజీగా దర్శించుకోవచ్చు.. ఎలాగంటే..?
స్వామి వారి దర్శనం కోసం స్లాటెడ్ సర్వ దర్శనం (SSD), దివ్య దర్శనం, ఉచిత దర్శనం టోకెన్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ టోకెన్లు తిరుపతిలో తెల్లవారుజామున 3.00 గంటలకు భక్తులను ఉచితంగా ఇస్తారు.
తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈ టోకెన్లు అందజేస్తారు.
ఈ టోకెన్లు తీసుకోవాలంటే మాత్రం ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలి.
ఈ టోకెన్లు జారీ చేసేటప్పుడు.. టైమ్, ఎంట్రీ వివరాలను కేటాయిస్తారు. ఆ టైమ్‌లో దర్శనానికి వెళ్లి.. స్వామి వారిని దర్శించుకోవచ్చు.
మరికొందరు కాలి నడకన తిరుమలకు వెళ్తారు. వారికి సైతం భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టికెట్లు ఇస్తారు.
ఈ టికెట్లతో సైతం శ్రీవారిని దర్శించు కోవచ్చు.
ఎస్ఎస్‌డి, దివ్యదర్శనం.. ఈ రెండు టికెట్లు ఇంచుమించిగా ఒక్కటే.
ఓ వేళ.. ఈ టికెట్లు సైతం దొరకకుంటే తిరుమలలో ఉచిత క్యూలైన్‌లో స్వామి వారి దర్శనానికి వెళ్ల వచ్చు.
ఈ ఉచిత దర్శనానికి వెళ్తే మాత్రం 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది.
Related Web Stories
గ్యాస్ బర్నర్స్ ఇలా ఈజీగా క్లీన్ చేయండి..!
శారీరకంగా కలవకుండానే పిల్లలు పెట్టే 8 జంతువులివే..
మీకూ ఫ్రిడ్జ్ పైన వస్తువులు ఉంచే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలుసుకోండి..!
ఇడ్లీలు మృదువుగా ఉండాలంటే ఈ ట్రిక్స్ ఫాలో కండి .!