ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ..
ఎలా పూజిస్తారంటే?
తెలంగాణలో బతుకమ్మ
సంబురాలు ముచ్చటగా
మూడో రోజుకు చేరుకున్నాయి
పూలను పూజించే సంస్కృతి కలిగిన తెలంగాణలో మూడో రోజు బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకుంటారు
ఎంగిలిపూల బతుకమ్మతో
వేడుకలు మొదలవగా రెండో
రోజు అటుకుల బతుకమ్మతో
మహిళలు ఆడిపాడారు
రెండో రోజున బతుకమ్మను రెండు
వరుసలతో పేర్చిన మహిళలు..
మూడో రోజు మూడు వరుసల
ఎత్తులో బతుకమ్మను సిద్ధం చేస్తారు
ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు
ముద్దపప్పు బతకమ్మను శిఖరం
ఆకారంలో పేరుస్తారు
అలాగే బతుకమ్మతో పాటు
పసుపుతో తయారు చేసిన
గౌరమ్మను ఉంచుతారు
ఈ బతుకమ్మ కోసం చామంతి,
మందారం పువ్వులతో పాటు
పలురకాల పువ్వులను కూడా పేరుస్తారు
అలాగే ఈరోజు ముద్దపప్పు,
పాలు, బెల్లంతో నైవేద్యం
తయారు చేసి గౌరమ్మకు సమర్పిస్తారు
సాయంత్రం వేళ ఆరుబయట
వాకిలిని శుభ్రం చేసి ముగ్గులు
వేసిన తర్వాత బతుకమ్మ
అక్కడ ఉంచుతారు
తోటి మహిళలు, పిల్లలతో
కలిసి పాటలు పాడుతూ
బతుకమ్మ చుట్టూ తిరుగుతారు
అనంతరం మహిళలు
వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు
అలాగే చిన్నారులకు
ముద్దపప్పును, పాలు, బెల్లాన్ని
ప్రసాదంగా పంచిపెడతారు
ఆపై బతుకమ్మను నీటిలో
నిమజ్జనం చేస్తుంటారు
Related Web Stories
రోజూ ఈ చట్నీ తినండి.. ఈ సమస్యలన్నీ పరార్..
మానవ మెదడు గురించి ఈ విషయాలు తెలుసా..!
మగాళ్లకు నో ఎంట్రీ.. !
నిమ్మకాయలు ఎండిపోయాయని బటయపడేస్తున్నారా.. ఈ సంగతి తెలిస్తే..