కొందరు పిల్లలు బాగా చురుగ్గా ఉంటారు. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే వాళ్లు సహజసిద్ధంగా టాలెంటెడ్ అని అర్థం.

చిన్నప్పటి నుంచే సంక్లిష్ట పదాలు, పెద్ద వాక్యాల్లో మాట్లాడుతున్నారంటే జన్మతః సామర్థ్యం ఉందని అర్థం

పిల్లలు కొత్త విషయాలు, నైపుణ్యాలను త్వరగా నేర్చుకోవడం కూడా పుట్టుకతో వచ్చిన ప్రతిభకు నిదర్శనం

కొందరు పిల్లలు చాలా చిన్నతనం నుంచే రాయడం చదవడంలో సహజసిద్ధ ప్రతిభ చూపిస్తారు.

చేసే పనిపట్ల శ్రద్ధ, ఏకాగ్రత చూపిస్తున్నారంటే పిల్లలకు పుట్టుకతో గొప్ప టాలెంట్ ఉన్నట్టే

చిన్నతనంలో మంచి జ్ఞాపకశక్తి కూడా జన్మతః సంక్రమించిన సామర్థ్యాలకు నిదర్శనం

పిల్లలు తమ సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుక్కుంటుంన్నారంటే వారు పుట్టుకతో టాలెంటెడ్ అని అర్థం

కొత్త విషయాలపై ఆసక్తి, కుతూహలం కూడా సహజసిద్ధ ప్రతిభకు ఓ కొలమానం

చిన్న తనంలోనే కళలు, మ్యాథ్స్‌పై ఆసక్తి పిల్లల్లో నిద్రాణంగా ఉన్న ప్రతిభకు సంకేతం