వారణాసిలో తప్పక సందర్శించాల్సిన 9 ప్రదేశాలు
కాశీ విశ్వనాథ్ ఆలయం: ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. దేశంలోని పవిత్ర స్థలాల్లో ఇది ఒకటి.
అస్సి ఘాట్: ఇది శాంతియుత వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ యోగ, ధ్యానం చేస్తుంటారు.
దశశ్వమేధ్ ఘాట్: ఇది రోజువారి గంగా హారతి వేడుకలకు ప్రసిద్ధి చెందింది. ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం.
సర్నాథ్: వారణాసి కొంత దూరంలోనే ఈ ప్రదేశం ఉంటుంది. బుద్ధుడు తన తొలి ఉపన్యాసం ఇక్కడే ఇచ్చాడు.
భరతమాత ఆలయం: భారత్‌లోని ఇతర దేవాలయాల తరహాలో కాకుండా, ఇది భారతదేశానికి అంకితం చేయబడింది.
మణికర్ణిక ఘాట్: అత్యంత పురాతన ఈ క్రిమేషన్ ఘాట్‌లో దహన సంస్కారాలు నిర్వహిస్తే.. జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
రామ్‌నగర్ కోట: 18వ శతాబ్దంలో వారణాసిని పాలించిన వారు ఈ కోటని నిర్మించారు.
తులసి మానస్ ఆలయం: ఈ రాముని ఆలయానికి రామచరితమానస్ రాసిన తులసిదాస్ పేరు పెట్టడం జరిగింది.
బనారస్ హిందూ యూనివర్సిటీ: ఇది అతిపెద్ద యూనివర్సిటీ. ఇందులో భరత్ కాల భవన్ మ్యూజియం, విశ్వనాథ్ ఆలయాలు ఉన్నాయి.
Related Web Stories
ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగొద్దు..ఎందుకంటే
మీకు షుగర్ ఉందా? బెల్లం గురించి ఈ విషయాలు తెలుసుకోండి..!
అత్యధిక ఆల్కహాల్ కంటెంట్ ఉండే.. 13 మద్యం బ్రాండ్లు ఇవే..
సమ్మర్లో ఈ మొక్కలు పెంచుకోండి.. హీట్ తగ్గించుకోండి