బంధాలు బలపడాలంటే మనసులో మాటను పంచుకోవడమే కాకుండా కొన్ని సార్లు మౌనం కూడా పాటించాలి

కోపం అదుపులో లేని సందర్భాల్లో మౌనమే శ్రేయస్కరం. నోరు జారితే మిగిలేది విచారమే

ఏదైనా అంశంపై పూర్తి సమాచారం లేనప్పుడు మౌనంగా ఉండాలి

ఎవరైనా దురుద్దేశపూర్వక విమర్శలు చేసినప్పుడు కూడా మౌనం పాటిస్తే అనేక లాభాలు కలుగుతాయి

ఒకరి విషయాలు మరొకరితో పంచుకునే బదులు మౌనంగా ఉండటమే మేలు

వాదనల వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదనిపిస్తే సైలెంట్‌గా ఉండటమే బెటర్

కొన్ని సందదర్భాల్లో మన మాటలు అవతలి వారిని నొప్పిస్తాయనుకుంటే మాటలను కట్టిపెట్టాలి

మన భావోద్వేగాలతో ఆడుకోవాలని చూసే వారితో కూడా మౌనంగా ఉంటే సులువుగా తప్పించుకోవచ్చు