ప్రపంచంలో అత్యంత ప్రమాదకర  జంతువులు ఇవే..  క్షణాల్లో ప్రాణాలు తీస్తాయి..!

బాక్స్ జెల్లీఫిష్..  బాక్స్ జెల్లీఫిష్‌ను చూడగానే పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉంది. మరణం కూడా క్షణాల్లోనే సంభవించవచ్చు..

తేలు..  తేలు కుట్టగానే శరీరంలో విషం ప్రసరిస్తుంది. దీంతో ఊపిరి ఆగిపోయి మరణం సంభవిస్తుంది.

బ్లాక్ మాంబా..  ఇది వేగంగా కదిలే పాము. ఈ పాము కాటేస్తే నిమిషాల్లో పక్షవాతం వచ్చి మరణం సంభవిస్తుంది.

పఫ్ యాడర్..  ఇది ఆఫ్రికాలో కనిపించే విషపూరిత పాము. ఇది కాటేస్తే శరీరంలోని కణజాలం దెబ్బతిని మరణం సంభవిస్తుంది.

 హిప్పోపొటామస్..  ఇది దూకుడుగా ఉండే జంతువు. దీనికి శక్తివంతమైన దవడలు, దంతాలతో మనుషులను చంపగలదు.

కేప్ గేదె..  ఇది ఆఫ్రికాలో కనిపించే భయంకర జంతువు. ఇది మనుషులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి చంపుతుంది.

 నైలు మొసలి..  ఇది శక్తివంతమైన సరీసృపం. దాని దవడలు, దంతాలతో మనుషులను చంపగలదు.

ఉప్పునీటి మొసలి..  ఇది నీటిలోనే కాకుండా బయట కూడా ప్రమాదకరమే. పడవలపైనా దాడి చేసి మనుషులను చంపుతుంది.

సింహం..  ఇది పంజా విసిరితే మనుషులు ప్రాణాలు వదలాల్సిందే. శక్తివంతమైన దంతాలతో మనుషులను చంపగలదు.

ధ్రువ ఎలుగుబంటి..  ఇది భూమిపై అతిపెద్ద ప్రెడేటర్. పంజా విసిరి దంతాలతో మనుషులను చంపుతుంది.