ట్రెడ్ మిల్ vs ఆరుబయట: వాకింగ్ ఎక్కడ చేస్తే మంచిది?
జిమ్‌లో మూసి ఉన్న గదుల్లో కంటే ఉదయాన్నే స్వచ్ఛమైన గాలి పీల్చుతూ ఆరు బయట నడవడం చాలా ఉత్తమం.
ఆరు బయట నడవడం అన్ని వేళలా కుదరదు. వర్షం పడుతున్నా, చలి ఎక్కువగా ఉన్నా ఆరు బయట వాకింగ్ చేయడం వీలు కాదు.
వాతావరణం బాగున్నప్పుడు ఉదయాన్నే బయట నడవడం వల్ల శరీరానికి సూర్య రశ్మి తగిలి డి-విటమిన్ ఉత్పత్తి మొదలవుతుంది.
ఆరుబయట నడిచే మార్గం సరైనది కాకపోతే మోకాళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ట్రెడ్‌మిల్ మెత్తగా ఉంటుంది కాబట్టి ఎంత నడిచినా మోకాళ్లు క్షేమంగానే ఉంటాయి.
ఉదయాన్నే పచ్చని ప్రకృతి మధ్య నడక సాగిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
ట్రెడ్ మిల్ మీద నడవడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి, ఎంత వేగంతో ఎంత సేపు పరిగెట్టామనే లెక్కలు పక్కాగా తెలుసుకోవచ్చు.
ట్రెడ్ మిల్ మీద నడవడం వల్ల కంటే ఆరు బయట నడవడానికి ఎక్కువ శక్తి అవసరం. కాబట్టి ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి.
వాతావరణం బాగుండి, మోకాళ్ల సమస్యలు లేకపోతే ఆరు బయట నడవండి. నడవడానికి పార్క్‌లు, మైదానాలు అందుబాటులో లేకపోతే ట్రెడ్ మిల్‌ను మించింది లేదు.
Related Web Stories
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఏంటో తెలుసా?
బుధవారం ఈ తప్పులు అస్సలు చేయకండి..!
ట్యాంక్‌బండ్‌పై విల్లు పట్టుకుని కోర మీసాలతో కనిపించే విగ్రహం అల్లూరి సీతారామరాజు
ట్యాంక్ బండ్ పై ఉన్న ఆన్నమయ్య విగ్రహాం గురించి తెలుసా?