వినాయక చవితికి మిల్లెట్స్ తో కుడుములు ఇలా చేయండి..!

వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టం.  అందుకే ప్రతి వినాయక చవితికి కుడుములు నైవేద్యంగా పెడతారు.

అటు ఆరోగ్యం, ఇటు వినాయకుడి ప్రీతి కోసం మిల్లెట్స్ తో కుడుములు చేసి నైవేద్యం పెట్టవచ్చు.

కాలసిన పదార్థాలు.. ఒక కప్పు రాగుల లేదా సజ్జ పిండి.  పావు కప్పు బియ్యం పిండి.  కొద్దిగా ఉప్పు.  ఒక కప్పు నీరు.  ఒక స్పూన్ నెయ్యి.

స్టఫ్ కోసం.. ఒక కప్పు బెల్లం,  ఒక కప్పు కొబ్బరి తురుము.  అరచెంచా యాలకుల పొడి.  రెండు స్పూన్ల  నెయ్యి.  గుప్పెడు డ్రై ఫ్రూట్స్.

ఒక  పాన్లో  ఒక కప్పు నీరు వేడి చేయాలి.  అందులో చిటికెడు ఉప్పు,  ఒక స్పూన్ నెయ్యి వేయాలి. మంట చిన్నగా ఉంచి అందులో మిల్లెట్స్ పిండి, బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా కలపాలి.

మిశ్రమాన్ని 3-5 నిమిషాలు తక్కువ వేడి మీద ఉడికించాలి.  స్మూత్ గా అనిపించినప్పుడు స్టౌ ఆఫ్ చేయాలి.

వేడి పిండిని చల్లబరిచి చేత్తో మెత్తగా మర్థన చేయాలి.

మరొక పాన్ లో రెండు స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి.  ఇందులో కొబ్బరి తురుము వేసి 2-3 నిమిషాలు వేయించాలి.

తురిమిన బెల్లం కలిపి బెల్లం కరిగాక యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి ముద్దగా అయ్యేవరకు ఉడికించి స్టౌ ఆప్ చేయాలి.

బెల్లం మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని మిల్లెట్ మిశ్రమం మధ్యలో బెల్లం మిశ్రమాన్ని ఉంచి కుడుములుగా చేసుకోవాలి.

పిండి అంచులను జాగ్రత్తగా మూసి మోదక్ షేప్ చేసుకోవాలి. అంతే.. వినాయకుడి నైవేద్యం కోసం మిల్లెట్స్ మోదక్ రెఢీ అయినట్టే..