దుస్తులపై మరకలు పోవాలంటే  ఈ ట్రిక్స్ ప్రయత్నించండి.. !

దుస్తుల పై లిప్ స్టిక్ మరక  పడితే దానిపై కాస్త గ్లిజరిన్  రాసి అరగంట తర్వాత  ఉతకాలి. ఇలా చేయడం  వల్ల మరక ఇట్టే పోతుంది

ఒక నిమ్మకాయ ముక్కను  మరకపై రుద్దడం వల్ల  ప్రభావవంతంగా పనిచేస్తుంది 

 హైడ్రోజన్ పెరాక్సైడ్  రక్తం లేదా తుప్పు  మరకలను తొలగించడానికి  బాగా పనిచేస్తుంది

హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్లీచింగ్  ప్రభావాన్ని కలిగి ఉంటుంది  కనుక ఇది ఫాబ్రిక్ రంగును  కోల్పోయేలా చేస్తుంది 

డిటర్జెంట్, స్టెయిన్ రిమూవర్  బట్టలు ఉతకడానికి ముందు  మరకలను స్క్రబ్ చేయడానికి ఉపయోగించవచ్చు

స్టెయిన్ రిమూవర్లు మొండి  మరకలను తొలగించడంలో సహాయపడుతుంది

దుస్తులపై ఇనుప తుప్పు  మరక పడితే అర బకెట్  నీళ్లలో ఒక టేబుల్ స్పూన్  పొడి ఉప్పు వేసి నానబెట్టాలి 

 ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల  నిమ్మరసం ఈ మరకల  పై వేసి బాగా కలిపి  డిటర్జెంట్ సబ్బుతో ఉతకాలి

దుస్తులపై కెచప్ మరక  పడితే, దాన్ని డిటర్జెంట్‌తో  ఉతికితే సరిపోతుంది. బ్రష్‌ని  ఉపయోగించి మరక  ఉన్నచోట రుద్దితే మరక  వెంటనే తొలగిపోతుంది