Weight Loss:  ఈ సమయాల్లో మీ బరువు చూసుకోకండి..

బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారు ఎప్పుడు వీలైతే అప్పుడు వెయిట్ చూసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. బరువులో ఏ మాత్రం తేడా వచ్చినా ఆందోళన చెందుతుంటారు.

రోజుకు రెండు, మూడు సార్లు బరువు చూసుకుని నెంబర్లలో చిన్నా తేడా వచ్చినా మెషిన్‌ది తప్పు అనుకుంటారు. నిజానికి కొన్ని ప్రత్యేక సమయాల్లో బరువు చూసుకుంటే కచ్చితమైన రీడింగ్ రాదు.

నాలుగు లేదా అంత కంటే ఎక్కువ గంటలు విమాన ప్రయాణం చేసిన తర్వాత బరువు చూసుకోకూడదు. ఆ సమయంలో శరీరంలోని ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత కారణంగా కొంత బరువు పెరగవచ్చు.

వ్యాయామం, వర్కవుట్స్ చేసిన వెంటనే బరువు చూసుకుంటే కచ్చితమైన రీడింగ్ రాదు. ఎందుకంటే వర్కవుట్స్ సమయంలో శరీరంలోని ద్రవాలు బయటకు వెళ్లిపోతాయి.

పీరియడ్స్‌కు ముందు మహిళలు కాస్త బరువు పెరుగుతారు. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత కారణంగా కొన్ని గ్రాముల బరువు పెరగవచ్చు.

మలబద్ధకంతో బాధపడుతున్న వారు కూడా కాస్త బరువు పెరుగుతారు. ఆ సమస్య తగ్గగానే ఆటోమేటిగ్గా బరువు నార్మల్‌కు వచ్చేస్తుంది.

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, జంక్ ఫుడ్ తిన్న తర్వాత నీరు ఎక్కువగా తాగేస్తుంటాం. ఆ సమయంలో బరువు చూసుకుంటే వాటర్ లెవెల్ కారణంగా కొన్ని గ్రాముల బరువు ఎక్కువగా కనిపిస్తుంది.

ఎండ బాగా ఎక్కువగా ఉన్న సమయంలో వెయిట్ చూసుకుంటే రీడింగ్ కచ్చితంగా రాదు. శరీరం డీ హైడ్రేట్ కావడం లేదా నీరు ఎక్కువగా తాగడం వంటి కారణాలతో బరువు తక్కువ, ఎక్కువ కావచ్చు.