చెప్పులు లేకుండా  నడిస్తే ఏం జరుగుతుంది..

చెప్పులు లేకుండా నడవడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

 మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా చెప్పులు లేకుండా నడవడం సహాయపడుతుంది.

ఒత్తిడిని దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

 ఉత్తి కాళ్లతో నడిస్తే.. కాళ్ల కండరాలు బలంగా మారుతాయి. దీంతో కాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

పాదాల్లో రక్తప్రసరణ జరిగేలా ఉపయోగపడుతుంది.

అధిక రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో కూడా ఉత్తి కాళ్లతో నడవడం ఉపయోగపడుతుంది. 

ఇలా నడిస్తే అటానమిక్ నాడీ వ్యవస్థను సమతుల్యం చేసే పారాసింపథెటిక్ చర్యను పెంచడం ద్వారా అధిక రక్తపోటును కంట్రోల్‌ చేస్తుంది.