మైండ్ వాండరింగ్ అంటే ఏమిటి? ఇది ఎందుకు జరుగుతుంది..!

మైండ్ వాండరింగ్ అనేది మన ఆలోచనలు మనం చేస్తున్న పని గురించి కాకుండా వేరే విషయాలను గురించి ఆలోచించడం, 

అచ్చం పగటి కలలు కనడం లాంటిది. ఎప్పుడూ ఏదో ఆలోచనలో మునిగి ఉండటం..

ఆలోచనలకు లంకె వేస్తూ ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిస్తూ, చేస్తున్న పనితో సంబంధం లేకుండా పోతుంది. 

ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉండిపోవడం అనేది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది మిగతావారికి, నిజానికి ఇది

దీర్ఘమైన ఆలోచన కారణంగా ఒక్కోసారి మతిమరుపు వల్లనేమో అనుకుంటూ ఉంటారు ఇదే మైండ్ వాండరింగ్.

మైండ్ వాండరింగ్ అనేది ఆలోచనలు చేతిలో ఉన్న పనితో సంబంధం లేని విషయాలు ఆలోచించడం, పగటి కలలు కనడం ఇలా ఉంటాయి. 

మైండ్ సంచారం అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి సృజనాత్మకతకు కనెక్షన్ ఉంటుందనేది నిపుణుల మాట

మైండ్ వాండరింగ్ అనేది మానసిక విరామంగా పని చేస్తుంది. మెదడుకు విశ్రాంతి, రీఛార్జ్ చేయడానికి ఇదో మార్గం.

మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. రోజులో చిన్న చిన్న విరామాలు మానసికంగా ప్రశాంతతను ఇస్తాయి. 

జ్ఞాపకశక్తికి పదును ఇది. భవిష్యత్ పై ఆలోచనలు అల్లుకుంటూ పోవడం జ్ఞాపకాలను పటిష్టం చేస్తుంది.