జీలకర్ర నీరు ఏ సమయంలో తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయంటే..!
జీలకర్ర నీరు చాలామంది ఆరోగ్యకరమైన అలవాట్లలో భాగంగా తీసుకుంటారు.
జీలకర్రను నీటిలో మరిగించి లేదా రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే వడగట్టి తాగుతుంటారు.
జీలకర్రను రాత్రి సమయంలో నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వడగట్టి ఆ నీటిని తాగాలి. ఇది జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. ఉబ్బరం, మలబద్దకం తగ్గుతాయి.
ఉదయాన్నే జీలకర్ర నీరు తాగుతుంటే బరువు తగ్గడం చాలా సులువు. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
జీలకర్ర నీరు శరీరంలో టాక్సిన్లను బయటకు పంపుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
జీలకర్ర నీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే జీలకర్ర నీరు తాగడం మంచిది.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల జీలకర్ర నీరు ఉదయాన్నే తాగితే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
జీలకర్ర నీరు కడుపులో ఆమ్లాలను కంట్రోల్ చేస్తుంది. ఇది గుండెల్లో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. పడుకునే ముందు తాగితే నిద్ర బాగా వస్తుంది.
భోజనానికి ఒక గంట లేదా అరగంట ముందు లేదా తర్వాత జీలకర్ర నీరు తాగితే అజీర్తి, ఉబ్బరం సమస్యలు దరిచేరవు.
Related Web Stories
దోమలతో వచ్చే ఈ వ్యాధుల గురించి తెలుసా
ట్రెడ్ మిల్ vs ఆరుబయట: వాకింగ్ ఎక్కడ చేస్తే మంచిది?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఏంటో తెలుసా?
బుధవారం ఈ తప్పులు అస్సలు చేయకండి..!