ఫేస్ వాష్ ను రోజులో ఏ సమయంలో, ఎన్ని సార్లు ఉపయోగిస్తే బెస్టో తెలుసా?
ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం చాలామంది ఫేస్ వాష్ వాడతారు. అయితే దాన్ని ఎప్పుడు ఏ సమయంలో వాడటం మంచిదో చాలా మందికి తెలియదు.
చర్మ సంరక్షణ నిపుణుల ప్రకారం ఫేస్ వాష్ ను రోజులో రెండుసార్లు ఉపయోగించవచ్చు.
నైట్ రోటీన్ స్కిన్ కేర్ చాలా తక్కువ మంది ఫాలో అవుతారు. రాత్రి నిద్రపోయే ముందు ఫేస్ వాష్ తో ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖం మీద మురికి తొలగిపోయి ముఖం చాలా రిలాక్స్ గా ఉంటుంది.
ఉదయం నిద్ర లేచిన తరువాత ఫేస్ వాష్ తో ముఖాన్ని కడుక్కోవాలి. దీని వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది. రోజంతా చర్మం చర్మ రంధ్రాల ద్వారా ఊపిరి పీల్చుకోగలుగుతుంది.
మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు మేకప్ తొలగించకుండా ఫేస్ వాష్ అస్సలు ఉపయోగించకూడదు.
రాత్రి సమయంలో ఫేస్ వాష్ వాడితే మొటిమలు, చర్మ సంబంధ సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు.
ఫేస్ వాష్ ఎంచుకునేముందు చర్మం రకం, ఫేస్ వాష్ లో ఉపయోగించిన పదార్థాలు పరిశీలించి తీసుకోవాలి.
ఫేస్ వాష్ ను రోజులో రెండు సార్ల కంటే ఎక్కువ ఉపయోగిస్తే చర్మం పొడిబారి సహజత్వాన్ని, తేమను కోల్పోతుంది.