పెరుగుతో ఉప్పు లేదా పంచదార..  ఏది కలుపుకుని తింటే ఆరోగ్యమంటే..!

పెరుగు అత్యంత శక్తివంతమైన ప్రోబయోటిక్, ప్రీ బయోటిక్ పదార్థం.

పెరుగులో ఉప్పు లేదా పంచదార కలుపుకుని తినడం చాలామంది అలవాటు.  ఎలా తింటే ఆరోగ్యమంటే..

శరీర వేడి అధికంగా ఉన్నవారు,  కడుపులో యాసిడ్,  జుట్టు రాలడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు పంచదార కలిపిన పెరుగుకు దూరం ఉండాలి.

అజీర్ణం,  గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడేవారు  పెరుగులో ఉప్పు కలిపి తీసుకోవడం మంచిది.

తీపి పెరుగు తినాలని అనిపిస్తే పంచదారకు బదులు కండ చక్కెర లేదా బెల్లాన్ని ఉపయోగించాలి.

టేబుల్ సాల్ట్ లో ఉండే అయోడిన్ వల్ల పెరుగులో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది.

టేబుల్ సాల్ట్ కలపిన పెరుగు వల్ల ప్రయోజనముండదు. రాతి ఉప్పు లేదా హిమాలయ పింక్ సాల్ట్ ఉపయోగించాలి.