ఇలా అయితేనే సూర్యుడి నుంచి మనకు తగినంత విటమిన్-డి అందుతుంది..
చాలా మంది ఉదయాన్నే ఎండ తగిలితే విటమిన్-డి అందుతుందని అనుకుంటారు. అది తప్పు. ఎందుకంటే ఆ సమయంలో సూర్యకాంతిలో యూవీ రేస్ చాలా తక్కువగా ఉంటాయి.
ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఎండతగిలేలా చూసుకుంటే మీ శరీరంలో తగినంత విటమిన్-డి సిద్ధమవుతుంది.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటలోపు 15-20 నిమిషాల పాటు ఎండలో ఉంటే యూవీ రేస్ నేరుగా శరీరానికి తగులుతాయి.
కొన్ని శీతల దేశాల్లో మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా యూవీ రేస్ చాలా వీక్‌గా ఉంటాయి.
ఎండలో ఎంతసేపు నిల్చోవాలనేది మీ స్కిన్ టైప్‌ను బట్టి నిర్ణయించుకోండి.
మీది లైట్ స్కిన్ అయితే 10-15 నిమిషాలు ఎండలో నిల్చంటే సరిపోతుంది. మీది డార్క్ స్కిన్ అయితే 20 నిమిషాలకు పైనే ఎండలో ఉండాలి.
ఎండలో నిల్చునే ముందు సన్ స్క్రీన్ లోషన్స్ లాంటివి రాసుకోకూడదు. అవి సూర్యకాంతిని చర్మం లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి.
సన్ స్రీన్స్‌ను ఎండలో నిల్చుని లోపలికి వెళ్లిన తర్వాత రాసుకుంటే చర్మం డ్యామేజ్ కాకుండా ఉంటుంది.
Related Web Stories
మీ టవల్‌ను ఉతక్కుండానే వాడుతున్నారా..!
జర్మనీకి క్యూ కడుతున్న భారతీయ స్టూడెంట్స్! కారణాలు ఇవే!
అత్యంత వేగంగా ఈదే జలచరాలు ఇవే!
నాలుగు గంటల్లోనే శంషాబాద్ నుంచి విశాఖపట్నం