పిల్లలు తల్లిదండ్రుల్ని సీక్రెట్‌గా గమనిస్తూ అనేక విషయాలు నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

తప్పు చేసినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తు్న్నారో చూసి పిల్లలు అనుకరిస్తారు. 

జీవితభాగస్వామిపై ప్రేమ చూపిస్తున్నారో లేదో గమనిస్తూ పిల్లలు కుటుంబబంధాల విలువ తెలుసుకుంటారు

విమర్శలు, ప్రశంసలకు తల్లిదండ్రులు ఎలా ప్రతిస్పందిస్తున్నారో చూసి పిల్లలూ అదే ఫాలో అవుతారు

ప్రణాళికల్లో ఆకస్మిక మార్పులకు ఎలా స్పందిస్తున్నారో చూస్తూ సర్దుబాటు ధోరణిని నేర్చుకుంటారు

అత్తమామల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి పెద్దలను ఎలా గౌరవించాలో నేర్చుకుంటారు

ఒత్తిడిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో గమనిస్తూ పిల్లలు అదే పద్ధతిని అనుసరిస్తారు 

నిబంధనలను పాటిస్తున్నారో లేదో గమనిస్తూ తాము అలాగే వ్యవహరిస్తారు.