పానీపూరి అంటే కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు, అది రుచి, సంతోషం కలిపిన ఒక అనుభూతి..
దీనిలో తీపి, పులుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ కలిసేలా ఉండటం వల్ల దీన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు.
ఒకసారి తిన్నాక మళ్లీ మళ్లీ తినాలనిపించే అలవాటు చేసే ఫుడ్ ఇది. అందుకే ఇది ప్రతి ఒక్కరి ఫేవరెట్‌గా మారింది.
మహారాష్ట్రలో దీని క్రేజ్ మరీ ఎక్కువ. పానీపూరి విపరీతంగా అమ్ముడవుతోంది.
కొన్ని నివేదికల ప్రకారం.. మహారాష్ట్ర రాష్ట్రంలో పానీపూరి అత్యధికంగా తినే స్ట్రీట్ ఫుడ్‌గా ఉంది. ముంబై, పూణే, నాగ్‌పూర్ లాంటి నగరాల్లో దీని డిమాండ్ విపరీతంగా ఉంటుంది.
నేటి తరం యువత నుంచి వృద్ధుల వరకూ అందరూ దీన్ని ఇష్టంగా తింటారు.