ఈ ఎండాకాలంలో జనాలు ఏసీలు, కూలర్ల కొనుగోలు చేస్తున్నారు. మరి ఈ రెండిట్లో ఏది బెటరంటే..

కూలర్ గంటకు 80 నుంచి 200 వాట్స్ వరకూ విద్యుత్ వినియోగిస్తుంది. 

ఏసీ సామర్థ్యాన్ని బట్టి గంటకు వెయ్యి నుంచి 2 వేల వాట్స్ విద్యుత్ వినియోగమవుతుంది

పోడి వాతావరణానికి కూలర్లు, తేమ ఎక్కువగా ఉండే వాతావరణానికి ఏసీలు తగినవి.

రోజుకు సగటున 8 గంటల పాటు కూలర్ వినియోగిస్తే నెలవారీ బిల్లు రూ.800 వరకూ పెరుగుతుంది. 

ఏసీ వినియోగంతో నెలవారీ విద్యుత్ బిల్లు రూ.5 వేలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

ఏసీ నిర్వహణ ఖర్చులు కూలర్ కంటే చాలా ఎక్కువ. 

కాబట్టి, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ రెండింట్లో ఏదోకటి ఎంచుకోవాలి.