ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి మేలు? దిండు వేసుకుని లేదా దిండు లేకుండానా..!
దిండు వేసుకుని నిద్రపోవడం వల్ల వెన్నెముక బెండ్ కావడాన్ని నివారించవచ్చు. ఇది మెడ, తలకు, సైడ్, బ్యాక్ స్లీపర్ లకు మంచిది.
దిండు లేకుండా పడుకోవడం పొట్టమీద పడుకునే వారికి మంచిది. ఇది మెడపై ఒత్తిడి తగ్గిస్తుంది.
దిండు వాడటం వల్ల ఒత్తిడి స్థానాలైన మెడ, భుజాల పై ఒత్తిడి తగ్గుతుంది. కంఫర్ట్ గా ఉంటుంది.
దిండు ఉపయోగించడం వల్ల తల సాధారణం కంటే కాస్త ఎత్తులో ఉంటుంది. శ్వాసనాళాలను సమర్థవంతంగా తెరచి నిద్రలో శ్వాసను మెరుగుపరుస్తుంది.
దిండు లేకుండా నిద్రపోవడం వల్ల ముఖం కుదించడం తగ్గుతుంది. దీని వల్ల ముఖం మీద గీతలు, ముడతలు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది.
మెడ నొప్పి ఉన్నవారు దిండు లేకుండా నిద్రపోవడం మంచిది. ఇది మెదడును ఎక్కువ వంగకుండా చేస్తుంది.
యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వ్యక్తులు దిండు వేసుకుని నిద్రపోవడం వల్ల కడుపులో ఆమ్లాలు అన్నవాహిక పైకి వెళ్లకుండా ఉంటుంది.
దిండు లేకుండా నిద్రపోవడం వల్ల కొందరికి మెరుగ్గా నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇది శరీరానికి సహజ స్థితిలో విశ్రాంతిని ఇస్తుంది.
.
Related Web Stories
పెరుగుతో ఉప్పు లేదా పంచదార.. ఏది కలుపుకుని తింటే ఆరోగ్యమంటే..!
వ్యాయామం, డైటింగ్ లేకుండా ఇలా కూడా బరువు తగ్గొచ్చట!
విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!
మద్యం తాగిన తర్వాత ఇవి తింటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి..!