విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న అనేక మంది భారతీయులు ప్రస్తుతం జర్మనీకి క్యూకడుతున్నారు

జర్మనీలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే టాప్

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జర్మనీలో ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య 15.1 శాతం పెరిగింది

జర్మనీలో కాలేజీ ఫీజులు భారతీయులకు అందుబాటులో ఉండటమే ఇందుకు ముఖ్య కారణం

అక్కడి జీవన వ్యయాలు కూడా భారతీయులు భరించే స్థాయిలోనే ఉంటున్నాయి

విదేశీ విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచే అనేక స్కాలర్ షిప్స్ కూడా ఉన్నాయి

ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు అనేకం జర్మనీలో ఉన్నాయి

విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటల వరకూ పార్ట్‌‌టైం ఉద్యోగం చేసుకోవచ్చు

చదువు తరువాత 18 నెలల పాటు అక్కడే జాబ్ చేసేందుకు పోస్టు స్టడీ పర్మిట్ కూడా ఇస్తారు