ఎర్ర చందనానికి ఎందుకంత డిమాండ్.. లాభాలు తెలుసా

ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో మాత్రమే దొరుకుతుంది.

శేషాచలం అడవుల్లో దాదాపు 5.5 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి.

ఎర్రచందనం దుంగ సుమారు రూ.50 లక్షల వరకు పలుకుతుంది. నాణ్యతను బట్టి ధర మారుతుంటుంది.

 చైనా, జపాన్‌ సహా వివిధ దేశాల్లో వాడే వంటపాత్రలను ఎర్రచందనంతోనే చేస్తారు.

 చెట్టు మార్కెట్‌కు రావడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో సాగు చేసిన ఎర్రచందనం 15-20 ఏళ్లలోనే కోతకు వస్తుంది.

 దీన్ని ఫర్నిచర్, సుగంధ ద్రవ్యాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.  

ఎర్ర చందనం వల్ల ఆరోగ్య లాభాలూ ఉన్నాయి. చర్మ వ్యాధులు, కంటి సంబంధిత వ్యాధులు, విష సర్పాలు, తేలు కుడితే విరుగుడుగా ఇది ఉపయోగపడుతుంది.