ముసలి జంటలు ఎందుకు విడిపోతున్నట్లు..!

50 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ వయసున్న జంటలు వివాహాలను ఈ పద్దతిలో తెంచుకుంటున్నారు. 

గ్రే డైవర్స్ విధానంలో 1990 నుంచి విడాకుల రేటు రెట్టింపు అయింది.

ఏ వయసులోనైనా విడాకులు తీసుకోవడం మామూలే. కానీ పెద్ద వయసు వారు కూడా ఈ పద్దతిని పాటిస్తున్నారు.

పిల్లలు పెరిగి ఇంటి నుంచి బయటికి వెళ్ళే సమయంలో కలిసి ఉండాల్సివ వృద్ధ దంపతులు మనస్పర్థలతో విడిపోతున్నారు.

50 తర్వాత అనారోగ్యం, ఆర్థిక సవాళ్లు, పొదుపు వ్యూహాలు, భవిష్యత్తు గురించి ఆందోళ దంపతుల మధ్య విభేదాలకు కారణం అవుతుంది.

పదవీ విరమణ తర్వాత జీవితం పట్ల అంతర్లీనంగా అననుకూలత మొదలుకావడం, ఒత్తిడి కూడా దీనికి కారణం కావచ్చు.

ఒకరికి ఒకరు తోడుగా ఉండే సమయంలో కలిసికట్టుగా ఉండలేని పరిస్థితులు, వ్యతిరేకతల మధ్య విడాకులు తప్పనిసరిగా మారుతున్నాయి.