ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? మీకు తెలియని నిజాలివీ..!
దేవీ నవ రాత్రులలో ఆయుధపూజకు చాలా విశిష్టత ఉంది.
నవ రాత్రులలో నవమి రోజు ఆయుధ పూజ చేస్తారు.
పంచాంగం ప్రకారం నవమి తిథి అక్టోబర్ 11వ తేదీ మధ్యాహ్నం 12:07 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. 12వ తేదీ ఉదయం 10:58 నిమిషాల వరకు ఉంటుంది.
ఆయుధ పూజ ముహూర్తం 11వ తేదీ మధ్యాహ్నం 01:30 నుండి 02:17వరకు ఉంటుంది.
ఆయుధ పూజను దక్షిణ భారత రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో జరుపుకుంటారు.
నవమి రోజు దేవుళ్లు, దేవతలు ఇచ్చిన ఆయుధాలు, శక్తులు ఉపయోగించి దుర్గాదేవి మహిషాసురుడుని వధించింది.
విజయం చేకూర్చిన ఆయుధాలను, శక్తులను గౌరవించే దృష్ట్యా ఆయుధ పూజ చేశారు.
వృత్తిని బట్టి వ్యక్తులు తాము ఉపయోగించే వస్తువులను ఆయుధపూజ రోజు అమ్మవారి ముందు ఉంచి పూజ చేస్తారు.
తాము ఉపయోగించే వస్తువులను అమ్మవారి ముందు ఉంచి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో పూజిస్తారు.
ఆయుధపూజ రోజు తమ ఆయుధాలను పూజించడం ద్వారా వారి వృత్తి వ్యాపార జీవితంలో కష్టాలు, నష్టాలు రాకుండా ఉంటాయని నమ్ముతారు.
Related Web Stories
దసరా రోజు చేయకూడని పనులు
విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
డయాబెటిస్, కొలస్ట్రాల్ మధ్య సంబంధమేంటి.. ఈ నిజాలు తెలిస్తే..
బాసరలో మూల నక్షత్ర పర్వదిన వేడుకలు